చంద్రబాబు నాయుడిని కలిసింది వీరే
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును నారా భువనేశ్వరి, లోకేశ్, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు. ములాఖత్ ద్వారా ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం, జైల్లోని పరిస్థితులపై ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి జ్ఞానేశ్వర్ తో చంద్రబాబు చర్చించారు
స్కిల్ స్కామ్ కేసులో గత నెల 9వ తేదీన అరెస్ట్ అయ్యారు చంద్రబాబు.. నవంబర్ 1వ తేదీ వరకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం చంద్రబాబు రిమాండ్ పొడిగించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ పంపించారు చంద్రబాబు. ఆ లేఖలో చంద్రబాబు తన సెక్యూరిటీపై సందేహాలు వెలిబుచ్చారు. రాజమండ్రి జైల్లోని భద్రతా లోపాల్ని ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన లేఖలో ప్రస్తావించారు. ఈనెల 25వ తేదీన చంద్రబాబు మూడు పేజీల లేఖ రాసారు. రాజమండ్రి జైల్లోని పలు లోపాలు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న తన ప్రాణాలకు ముప్పుగా పరిణమించినట్లు చంద్రబాబు తెలిపారు