Chandrababu : జగన్ సిద్ధంగా ఉండు.. సర్దుకుని వెళ్లపోదువు గాని
రానున్న ఎన్నికల్లో జగన్ కు దిమ్మతిరిగే ఫలితం రాబోతోందని చంద్రబాబు అన్నారు;
రానున్న ఎన్నికల్లో జగన్ కు దిమ్మతిరిగే ఫలితం రాబోతోందని చంద్రబాబు అన్నారు. లీగస్ సెల్ సమ్మిట్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. షెడ్యూల్ రాకతో ఉన్మాదుల నుండి స్వాతంత్ర్యం వచ్చినంత ఆనందంగా ప్రజలున్నారన్న ఆయన అధికారంలోకి రాగానే జూనియర్ న్యాయవాదులకు ఏడు వేల రూపాయల గౌరవవే తనం గా ఇస్తామని, వంద కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో లీగల్ సెల్ వర్క్ షాప్ లు పెట్టుకోవాల్సి వస్తోందని, తన నామినేషన్ ను కార్యకర్తలు, న్యాయవాదులే వేసేవారని, కేవలం డిక్లరేషన్ పత్రంపైనే నేను సంతకం చేసేవాడినని, కానీ నేడు నాపై ఎన్నికేసులు ఎన్నాయో ముందుగానే డీజీపీని, అధికారులను లేఖల ద్వారా అడిగే పరిస్థితి ఉందని ఆయనఅన్నారు.
నామినేషన్ వేయడానికి...
నామినేషన్ వేయాలనుకునే ప్రతి అభ్యర్థి తనపై ఎన్ని కేసులు ఎన్నాయో చెప్పండి అని అడుక్కునే పరిస్థితి నేడు వచ్చిందన్నారు. రాజ్యాంగంలో శాసన, కార్యనిర్వహక, మీడియా వ్యవస్థలను జగన్ ప్రభుత్వం తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకుందన్నారు. గాడిలో పెట్టేది న్యాయ వ్యవస్థేనని, న్యాయ వ్యవస్థ లేకుండా మనం ఇక్కడ ఉండేవాళ్లం కాదని అన్నారు. తతో పాటు మా లాయర్లు కూడా నిద్రలేని రాత్రులు గడిపారన్న చంద్రబాబు ప్రతి శుక్రవారం రాష్ట్రంలో ప్రొక్లెయిన్లు వస్తాయన్నారు. ఇల్లీగల్ కస్టడీకి కూడా తీసుకున్నారని, నామినేషన్లు వేయడానికి కూడా వీల్లేని పరిస్థితిని స్థానిక సంస్థల ఎన్నికల నుండి చూస్తున్నామన్న చంద్రబాబు బెదిరింపులు, భయపెట్టడాలు, నామినేషన్ వేయడానికి అవసరమైన సర్టిఫికేట్లు కూడా ఇవ్వనీయరని అన్నారు. ఆదివారం ప్రధానితో ప్రజాగళం సభను చిలకలూరిపేటలో నిర్వహిస్తున్నామని, కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు రాబోతున్నాయన్నారు.