సాయంత్రం బెజవాడకు చిరంజీవి

చంద్రబాబు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి రానున్నారు

Update: 2024-06-11 07:15 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ప్రమాణ స్వీకారానికి రావాలంటూ చంద్రబాబు చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఆయన ఈరోజు సాయంత్రం విజయవాడకు చేరుకోనున్నారు.

రేపటి కార్యక్రమానికి....
రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన నేతలు కూడా రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముండటంతో చిరంజీవి వచ్చి వారికి అభినందనలు తెలపాలని నిర్ణయించుకున్నారు. దీంతో చిరంజీవి ఈరోజు సాయంత్రానికే విజయవాడ చేరుకుంటారని చెబుతున్నారు.


Tags:    

Similar News