Chandrababu : నేడు ముందస్తు బెయిల్ పై విచారణ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది;
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు కీలక నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో ఆయన తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వవద్దంటూ సీఐడీ తన అఫడవిట్ లో సీఐడీ తరుపున న్యాయవాదులు పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ లో జరిపిన అవకతవకలు పెద్దయెత్తున జరిగాయని ఆరోపించింది.
అసలు లేనే లేని...
అయితే అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు లేదని, అవకతవకలు ఎలా జరుగుతాయని చంద్రబాబు తరుపున న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. నేడు రెండు వర్గాల వాదనలను హైకోర్టు ధర్మాసనం విననుంది. ఇప్పటికే స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్ పొందిన చంద్రబాబుకు ఈ కేసులో కూడా ఊరట లభిస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వరస కేసులు నమోదు చేస్తూ చంద్రబాబును జైల్లో ఉంచాలని చూస్తుందని ఆయన తరుపున న్యాయవాదులు చెబుతున్నారు.