Chandrababu : కలెక్టర్ల సమావేశంలో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు;

కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. మెగా డీఎస్సీ వచ్చే నెల తొలివారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. జూన్ తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు ఉపాధ్యాయులు అందరూ విధుల్లో జాయిన్ అయిపోవాలని చంద్రబాబు కలెక్టర్లకు తెలిపారు. పింఛన్లను నాలుగు వేల రూపాయలకు పెంచామని, ఏ రాష్ట్రంలో ఇంత పింఛను ఇవ్వడం లేదని చంద్రబాబు అన్నారు. కలెక్టర్లు బయటకు వచ్చి ప్రజల ఇబ్బందులను గమనించాలని, వాటిని తొలగించేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు. మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తామని, అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా త్వరలోనే ఇస్తామని తెలిపారు.
సంక్షేమ పథకాలను...
సంక్షేమపథకాలు అర్హులైన ప్రతి ఒక్క అధికారి బాధ్యత తీసుకుని అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మానవతా థృక్పథంతో వ్యవహరించాలన్న చంద్రబాబు నాయుడు పోలవరం, అమరావతి నిర్మాణాలను పూర్తి చేయడానికి సిద్ధమయ్యామని తెలిపారు. ల్యాండ్ టైట్ లింగ్ యాక్ట్ ను రద్దు చేశామన్న చంద్రబాబు నాయుడు భవిష్యత్ కార్యాచారణను ప్లాన్ చేసే పనిలో కలెక్టర్లు నిరంతరం ఉండాలని చంద్రబాబు కోరారు. అన్న క్యాంటిన్లను నిరంతరం తనిఖీలు చేస్తూ నిరంతరం కాపాడుతుండాలని చంద్రబాబు కలెక్టర్లను కోరారు.