Andhra Pradesh : చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.;

Update: 2024-06-27 07:43 GMT

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం అమలు పర్చిన విధానాల్లో మార్పులు తెచ్చేందుకు సిద్ధమయింది. ఈ మేరకు అన్ని శాఖలపై సమీక్షలు జరుపుతున్న చంద్రబాబు నాయుడు సర్కార్ తాజాగా గనుల శాఖపై కూడా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గనుల శాఖలో, ఇసుక అమ్మకాల్లో ఆన్ లైన్ విధానం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

గనుల శాఖలో ...
గత ఐదేళ్లు చేతిరాతతో ఇచ్చిన బిల్లులతో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. దీంతో గత టీడీపీ హయాంలో అంటే 2014 నుంచి 2019 వరకూ అమలులో ఉన్న ఆన్ లైన్ విధానాన్నే తీసుకురానున్నారు.ఈ మేరకు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇటు సీవరేజి వసూళ్ల కాంట్రాక్టర్లూ ఆన్ లైన్ పర్మిట్లే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News