Chandrababu : దేవుడి స్క్రిప్ట్ అలాగే రాశాడు.. అందుకే ఇంతటి విజయం

అమరావతి బ్రాండ్ దెబ్బతినేలా విషప్రచారం చేశారని, ఐదేళ్లు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

Update: 2024-06-20 12:00 GMT

అమరావతి బ్రాండ్ దెబ్బతినేలా విషప్రచారం చేశారని, ఐదేళ్లుగా రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులంతా 1631 రోజులు ఆందోళన చేశారని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆందోళన విరమించారన్నారు. సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రాజధాని రైతులకే దక్కుతుందన్న చంద్రబాబు రైతుల పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతుందన్నారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని, ఐదు కోట్ల ప్రజానీకానికి దశ, దిశ నిర్దేశించే రాజధానిగా అమరావతిని రూపుదిద్దుతామని తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లు ఉండే నది గోదావరి అని పోలవరం పూర్తి, నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లిచే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం.. శాపంగా మారిందన్న చంద్రబాబు ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం పాలన ప్రారంభించిందన్నారు. ఐదేళ్లుగా వైసీపీ విధ్వంసం పాలన సాగించిందని, ఎక్కడికక్కడ మట్టి, ఇసుక దోచుకున్నారన్నారు.

ఏపీ అంటే అమరావతి, పోలవరం...
ఒక్క భవనం కూడా ఎక్కడా పూర్తి చేయలేదని, దాదాపు 80 శాతం పూర్తయిన భవనాలనూ పట్టించుకోలేదన్న చంద్రబాబు కర్నూలును ఆధునిక నగరంగా తయారుచేయాలన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఆనాడు స్పష్టమైన విధానం తెచ్చామని, ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు. జగన్ లాంటి వ్యక్తి అవసరం లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని, జగన్‍ను చిత్తుచిత్తుగా ఓడించారని, జగన్ పట్ల ప్రజలు అంత వ్యతిరేకతతో ఉన్నారని అన్న చంద్రబాబు అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. మూడు రాజధానుల ఉన్మాది బారి నుంచి రాష్ట్రాన్ని దేవుడే కాపాడారని, గల్లా పెట్టె ఖాళీ అయిపోయిందని, అప్పులు విపరీతంగా చేశారకని, డబ్బులు లేవంటూనే రూ.500 కోట్లతో రుషికొండలో భవనాలు కట్టారన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చి కోర్టులను తప్పుదారి పట్టించారు. అమరావతి రైతులు 1631 రోజులు పోరాడారని, 1+6+3+1=11, వైసీపీకి 11 సీట్లే వచ్చాయని.. ఇదే దేవుడి స్క్రిప్ట్ అన చంద్రబాబు అన్నారు.


Tags:    

Similar News