మోదీతో ముగిసిన భేటీ... గంటసేపు...?
ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం ముగిసింది. దాదాపు గంట సేపు సమావేశం జరిగింది.
ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం ముగిసింది. దాదాపు గంట సేపు సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ఈ సందర్భంగా జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించారు. దీనికి సంబంధించి వినతిపత్రాన్ని కూడా జగన్ అందించారు. రాష్ట్ర విభజన అంశాలు రాష్ట్ర ప్రగతిని తీవ్రంగా దెబ్బతీశాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి జగన్ తెలియజేశారు. విభజన వల్ల రాష్ట్ర రాజధానిని కూడా కోల్పోయామన్నారు.
విభజన హామీలను....
విభజన జరిగిన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తే చాలా వరకూ ఊరట కలుగుతుందని జగన్ చెప్పారు. జనాభా ఎక్కువ కావడంతో ప్రజల అవసరాలను తీర్చాలంటే ఆర్థిక భారం పెరుగుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా పెరిగిందని, దీనికి కేంద్రం సహకరించాలని కోరారు. ఇలా అనేక సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి జగన్ తీసుకెళ్లారు. ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిసింది. ఈరోజు జగన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను, రేపు హోంమంత్రి అమిత్ షాను జగన్ కలవనున్నారు.