శ్రీశైలం టన్నెల్ ప్రమాదం పై రేవంత్ కీలక నిర్ణయం
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో జరుగుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు;

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో జరుగుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సహాయక చర్యలను కొనసాగించాలని నిర్ణయించారు. సీనియర్ అధికారిని పర్యవేక్షణకు నియమించాలని చీఫ్ సెక్రటరీ శాంతకుమారిని ఆదేశించారు. శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మరణించిన నేపథ్యలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సహాయక చర్యలను కొనసాగించాలని...
ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు సహాయక చర్యలు కొనసాగించాల్సిందేనని, మృతదేహాలు లభ్యమయ్యేంత వరకూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలనితెలిపారు. ప్రమాద ఘటనలో ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యల పురోగతిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులకు తెలిపారు. . అధికారుల నుంచి తాజా నివేదికలను పరిశీలించిన సీఎం, కేంద్ర అనుమతులను పొందుతూ నిపుణుల సూచనల ఆధారంగా రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు పాల్గొన్నారు.