కుప్పంతో మొదలుపెడుతున్న జగన్

రేపటి నుంచి వైసీపీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం అవుతున్నారు;

Update: 2022-08-03 03:01 GMT
ys jagan, ycp chief, plenary
  • whatsapp icon

రేపటి నుంచి వైసీపీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం అవుతున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం అయ్యేందుకు సిద్దమవుతున్నారు. పార్టీ పరిస్థితులను తెలుసుకునేందుకు జగన్ నేరుగా కార్యకర్తలతో సమావేశం అవ్వనున్నారు. ఇందుకు సంబంధించి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో తగిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. వచ్చే ప్రతి వారికి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని పార్టీని అధికారులు ఇప్పటికే ఆదేశించారు.

పీకే టీం ఫిల్టర్ చేసి...
తొలిదఫాగా రేపు కుప్పం కార్యకర్తలతో సమావేశాలను జగన్ ప్రారంభించనున్నారు. కుప్పం నియోజకవర్టంలో ఎంపిక చేసిన యాభై మంది కార్యకర్తలతో రేపు నేరుగా జగన్ మాట్లాడతారు. వీరిని ప్రశాంత్ కిషోర్ టీం ఎంపిక చేసినట్లు తెలిసింది. పార్టీకి గత ఎన్నికలలో పనిచేసి పార్టీకి దూరంగా ఉన్న కార్యకర్తలను గుర్తించి వారిని ఈ సమావేశానికి రప్పిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితా ప్రకారం ఆ కార్యకర్తలను కూడా కొందరికి ఈ సమావేశానికి పిలిచే అవకాశముంది.


Tags:    

Similar News