ఆయన చిరునవ్వు అలానే ఉంది...జగన్ ట్వీట్

తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావోద్వేగానికి గురయ్యారు;

Update: 2022-09-02 03:10 GMT
ఆయన చిరునవ్వు అలానే ఉంది...జగన్ ట్వీట్
  • whatsapp icon

తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావోద్వేగానికి గురయ్యారు. భౌతికంగా ఆయన దూరమైనా తన తండ్రి చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయని ట్వీట్ చేశారు. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పారన్నారు.

పాలనలో కూడా..
ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ఇడుపుల పాయలో వైఎస్ ఘాట్ వద్ద ఆయన కు ఘనంగా నివాళులర్పించారు. అక్కడ జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఇడుపులపాయ ఘాట్ కు వచ్చారు.


Tags:    

Similar News