సునీల్ కుమార్ కు పదోన్నతి
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు పదోన్నతి లభించింది. ఆయనకు అదనపు డీజీగా పదోన్నతి కలిపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది;
ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు పదోన్నతి లభించింది. ఆయనకు అదనపు డీజీగా పదోన్నతి కలిపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఆయన తనకు పదోన్నతి కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సుదీర్ఘమైన పోస్టును సోషల్ మీడియలో పెట్టారు. అదే యధాతధంగా...
చాలా రోజులయింది...
"ప్రమోషన్ వార్త విన్నాక ఒక్క క్షణం భావోద్వేగానికి లోనయ్యాను. ముందుగా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి గారికి కృతజ్ణతలు ఎందుకు అంటే నేను వారిని కలిసి చాలా రోజులు అయ్యింది ... నేను కొద్ది రోజులు వ్యక్తిగత పనుల మీద సెలవు తీసుకోవడం ... నేను తిరిగి వచ్చే సరికి వారు తన షెడ్యూలు లో తీరిక లేకుండా ఉండటం తో కలవడం వీలు పడలేదు అంతకు ముందు కలిసినపుడు కూడా నా ప్రమోషన్ గురించి ప్రస్తావించే సందర్భం రాలేదు అయినా ... అడగక పోయినా గుర్తు పెట్టుకు మరీ ప్రమోషన్ ఇచ్చినందుకు వారికి వేనవేల కృతజ్ఞతలు నీకు రావలసిందే కదా ఆయన ఇచ్చాడు అనవచ్చు. కొందరు నాకు ఐ జీ నుండి అదనపు డీజీ గా పదోన్నతి పొందిన చేదు జ్ణాపకం గుర్తు వచ్చింది.
2018 … అప్పటి డీజీ నుండి ఫోన్ ...
యాదృచ్చికం కావచ్చు అప్పుడు కూడా గోల్ఫ్ క్లబ్ లో నే ఉన్నాను సాయంత్రం " మీ ఏ సీ ఆర్ లు రెండు కనబడలేదు ... అందువల్ల మీ పదోన్నతికి రికమండ్ చేయడం లేదు .. మీరు కాకుండా మీ బేచ్ మేట్ లకు ప్రమోషన్ ఇస్తున్నాం " అన్నాడు ఆయన " నా పై ఎలాంటి ఆరోపణలు కానీ , విచారణ కానీ లేవు ... అత్యున్నత పురస్కారం ప్రసిడెంట్ పోలీస్ మెడల్ కూడా ఐ జీ గానే అందుకున్నాను .. చాలామంది అదనపు డిజీ లు .. డీజీ లకు కూడా ఆ పురస్కారం రాలేదు .. నా రికార్డ్ బాగe లేకుంటే ఆ మెడల్ రాదు కదా .. పైగా నేను ఏ సీ ఆర్ లు సబ్మిట్ చేసినట్టు ఆధారం ఉంది .. అవి కనపడక పోతే మీ పొరపాటు .. నాది కాని తప్పుకు నాకు శిక్ష ఏమిటి ? నా బేచ్ మేట్లకు ఇచ్చి నాకు ఇవ్వక పోతే నేను ఏదొ తప్పు చేశా అనుకుంటారు ... మీరు ప్రమోషన్ ఇవ్వక పోతే మీ మీద , చీఫ్ సెక్రటరీ మీద ఎస్సి యస్టి అట్రాసిటీ కేసు పెడతా " అని చెప్పాక , నన్ను మళ్ళా నేను పని చేసిన పాత అధికారుల వద్దకు తిప్పించి , మళ్ళా రికార్డులు రాయించి ... అయిష్టం గా ఇచ్చారు అంతే కాదు ప్రమోషన్ తరువాత నా బేచ్ మేట్ కింద పని చేసేలా ఆర్డర్ ఇచ్చి అవమానించారు ... నిరనన గా సెలవులో పోతే అప్పుడు పోలీస్ హౌసింగ్ ఇచ్చారు దళితుడుగా ఎవరు పుట్టాలి అని కోరుకుంటారు అంటే ... నేను మళ్లీ" అని సునీల్ కుమార్ పోస్టు ముగించారు.