27న విజయవాడ, మంగళగిరి లలో సీఎం జగన్ పర్యటన

విజయవాడ వించిపేటలో షాజహూర్ ముసాఫిర్ ఖానా, ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు.;

Update: 2022-04-24 13:20 GMT
27న విజయవాడ, మంగళగిరి లలో సీఎం జగన్ పర్యటన
  • whatsapp icon

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27న విజయవాడ, మంగళగిరి లలో పర్యటించనున్నారు. విజయవాడ వించిపేటలో షాజహూర్ ముసాఫిర్ ఖానా, ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు. అనంతరం ముస్లిం మతపెద్దలతో సమావేశం కానున్నారు. సమావేశం ముగిసిన అనంతరం రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు. 27వ తేదీ సాయంత్రం మంగళగిరిలోని గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ క్రిస్టినా కుమారుడి పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు.



Tags:    

Similar News