కరోనా గిరోనా జాన్తానై.. బరుల్లో ఢీ

ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. రెండు జిల్లాల్లో పదుల సంఖ్యలోనే బరులను ఏర్పాటు చేశారు;

Update: 2022-01-15 03:59 GMT
cock fights, east godavari, west godavari, andhra pradesh
  • whatsapp icon

కరోనా భయపెడుతున్నా కోళ్లు మాత్రం ఢీ అంటున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. రెండు జిల్లాల్లో పదుల సంఖ్యలోనే బరులను ఏర్పాటు చేశారు. దాదాపు నాలుగు వందల బరుల వరకూ ఉన్నాయి. ఈరోజు, రేపు మరింత జోరుగా కోడిపందేలు కొనసాగనున్నాయి. కోడిపందేలు సంస్కృతిలో భాగం కావడంతో పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి.....
ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది గోదావరి జిల్లాలకు వచ్చారు. లక్ష నుంచి పది లక్షల వరకూ పందేలు కాస్తున్నారు. క్యాష్ ను లెక్కించడం కోసం మిషన్లను ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ లో డబ్బులు తీసుకునేందుకు క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ లను కూడా పందెం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈరోజు, రేపు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. కరోనాను లెక్క చేయకుండా కోడిపందేలను నిర్వహిస్తుండటంపై పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు.


Tags:    

Similar News