మళ్లీ పెరిగిన చలి

తెలుగు రాష్ట్రాల్లో చలి పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Update: 2022-12-18 03:35 GMT

తెలుగు రాష్ట్రాల్లో చలి పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ లో 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సిద్ధిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ లో 14,9 డిగ్రీలు, మెదక్ జిల్లా శంకరంపేటలో 16,1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలిగాలుల పెరగడంతో ఉదయం పది గంటలయినా ప్రజలు బయటకు రాలేకపోతున్నారు.

పడిపోతున్న ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అరకు లోయలో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తుపాను ప్రభావం తర్వాత చలి మళ్లీ పెరిగింది. మంచుకురుస్తుండటంతో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో అరకులోయ వస్తున్నారు. మాడగడ మేఘసంద్రం వ్యూ పాయింట్ వద్ద పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. మాడగడ వెళ్లే రహదారిలో వాహనాలు బారులు తీరాయి.


Tags:    

Similar News