Andhra Pradesh : 10 నుంచి ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 10వ తేదీ నుంచి కలెక్టర్ల సమావేశం జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 10వ తేదీ నుంచి కలెక్టర్ల సమావేశం జరగనుంది. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. 10, 11 తేదీల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
ఆరు నెలలవుతున్న నేపథ్యంలో...
కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను వారికి వివరించనున్నారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతతో పాటు ఉచిత ఇసుక, మద్యం ధరలు వంటి వాటిపై కూడా చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. 11వ తేదీన రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్యలపై కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.