ఏపీ గవర్నర్ పై నారాయణ సంచలన వ్యాఖ్యలు

ఏపీ గవర్నర్ పై సీపీఐ నేత నారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. తాను ఏపీ గవర్నర్ గా ఉండి ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడినన్నారు.;

Update: 2022-04-05 06:39 GMT

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పై సీపీఐ నేత నారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. తాను ఏపీ గవర్నర్ గా ఉండి ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడినన్నారు. జగన్ తీసుకునే పిచ్చి నిర్ణయాలన్నింటికీ గవర్నర్ ఆమోదం తెలుపుతున్నారని నారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించబట్టే గవర్నర్ ఆ ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని అన్నారు. జగన్ తాను రద్దు చేసిన నిర్ణయాలను మళ్లీ తానే అమలు చేస్తున్నారని, వాటిని గవర్నర్ ఎలా ఆమోదిస్తారని నారాయణ ప్రశ్నించారు.

ఇష్టారీతిన నిర్ణయాలు....
చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే కుదరదని నారాయణ అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు 23 సీట్లు అయినా వచ్చాయని, జగన్ కు వచ్చే ఎన్నికలలో అన్ని సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తెగ ప్రయత్నిస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని నారాయణ కితాబిచ్చారు. రాబోయే రోజుల్లో బీజేపీ వ్యతిరేకశక్తులను ఏకం చేస్తామని నారాయణ తెలిపారు.


Tags:    

Similar News