ఇది అన్యాయం : సీఎస్‌కు సీపీఐ లేఖ

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ రాశారు;

Update: 2023-10-22 05:20 GMT
ramakrishna, cpi, ysrcp, employees, andhra pradesh
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ రాశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు తక్షణమే ప్రభుత్వం బకాయీలు చెల్లించాలని లేఖలో డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు లక్షల మంది ఉపాధ్యాయులకు ఎనిమిది వందల కోట్ల రూపాయల బకాయీ ఉందని, అవి తక్షణం చెల్లించాలని ఆయన తన లేఖలో కోరారు.

ఉద్యోగులకు...
ఉద్యోగులకు 2022 జులై నుంచి ఇవ్వాల్సిన డీఏను 2024లో మూడు విడతలుగా చెల్లిస్తామనడం దుర్మార్గమని రామకృష్ణ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బకాయీల కోసం ఇప్పటికే ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీపీఎస్ విషయంలోనూ ఉద్యోుగలకు అన్యాయం జరిగిందన్నారు రామకృష్ణ.


Tags:    

Similar News