Tirumala : ఈరోజు రష్ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తులు పెద్ద సంఖ్యలో మాత్రం తిరుమలకు రావడం లేదు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తులు పెద్ద సంఖ్యలో మాత్రం తిరుమలకు రావడం లేదు. సంక్రాంతి పండగ సెలవులకు భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను టీటీడీ పరిశీలిస్తుంది. భక్తులు ఎంత మంది వచ్చినా అందుకు తగిన సౌకర్యాలను కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు నేడు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది.
పది గంటల సమయం...
నిన్న తిరుమల శ్రీవారిని 62,449 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,555 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.45 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని రెండు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్ లోకి ఉదయం ఏడుగంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుంది.