Rain Alert : దానా దెబ్బకు ఏం జరుగుతుందో? టెన్షన్ టెన్షన్

ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనం వాయుగుండంగా మారింది

Update: 2024-10-23 05:01 GMT

ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తుపాను గా మారనుంది. దీనికి దానాగా నామకరణం చేశారు. దానా తుపాను ప్రభావంతో ఏపీలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిాంది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఈ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. రేపు రాత్రి గాని ఎల్లుండి ఉదయం కానీ ఒడిశా - పశ్చిమ బెంగాల్ మధ్య తుపాను తీరం దాటే అవకాశముందని తెలిపింది.

రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో అప్రమత్తం...
దానా తుపానుతో ఆంధ్రప్రదేశ్ వణికిపోతుంది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో అధికార యంత్రాంగం అలెర్ట్ అయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఉత్తరాంధ్ర, రాయలసీమలో అధికారులు హై అలెర్ట్ ను ప్రకటించారు. ఆ సమయంలో విద్యుత్తు సౌకర్యాన్ని నిలిపివేయనున్నారు. అనేక జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు పనిచేయాలని ఆదేశించింది.
రైళ్ల రద్దు...
ఈరోజు అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. కడప, తిరుపతి జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు పడే అవకాశముది. మత్స్యకారులను చేపల వేటను నిషేధించారు. ఏపీలోని అన్ని పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పడంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఎల్లుండి వరకూ మొత్తం 66 సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.



Tags:    

Similar News