ఈ రెండు రైళ్లలో రెచ్చిపోయిన దొంగలు.. అందినకాడికి దోచుకెళ్లారు

ఈ మధ్య కాలంలో రైళ్లలో దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి సమయాల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండే అవకాశం ఉన్నందున ఆ సమయం అనుకూలంగా..

Update: 2023-08-14 05:22 GMT

ఈ మధ్య కాలంలో రైళ్లలో దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి సమయాల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండే అవకాశం ఉన్నందున ఆ సమయం అనుకూలంగా భావిస్తున్న దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. అవసరమైతే ప్రాణాలు తెగించి దొంగతనం చేసి ప్రయాణికులను సైతం చంపేందుకు కూడా సిద్దపడుతున్నారు. తాజాగా ఓ రైలులో దొంగల ముఠా హల్ చల్ చేశారు. దీంతో ఏపీలోని నెల్లూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. సింగరాయకొండ – కావలి మధ్య రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దొంగల ముఠా రెచ్చిపోయారు. అయితే సికింద్రారాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో, అలాగే సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలులో దొంగలు దోపిడికి పాల్పడ్డారు.

సింగరాయకొండ-కావలి నడిచే రైలులో ఈ దొంగతనం అర్ధరాత్రి 1:20 గంటల నుంచి 1:50 మధ్య జరిగినట్లు ప్రయాణికులు వెల్లడించారు.ఇక సికింద్రాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్‌2, ఎస్‌4, ఎస్‌6, ఎస్‌7, ఎస్‌8 బోగీల్లోకి దొంగలు ప్రవేశించి ప్రయాణికుల నుంచి అందిన కాడికి నగదు, బంగారు నగలను దోచుకెళ్లారు.చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌1, ఎస్‌2 బోగీల్లో దొంగతనానికి పాల్పడ్డారు.

అర్థరాత్రి సమయాల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉంటారనే ఉద్దేశంతో ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. రైల్లో నిద్రిస్తున్న ప్రయాణికుల మెడలో నుంచి బంగారు నగలు దోచుకెళ్లారు. ప్రయాణికుల అరుపులతో ఒక్కసారిగా అప్రమత్తం అయిన గార్డులు, తెట్టు, కావలి రైల్వే పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గుడ్లూరు మండలం వీరేపల్లి దగ్గర చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. దొంగల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ప్రతి రైలు బోగీల్లో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలోనే దొంగలు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. దొంగల ముఠా సభ్యులు ప్రాణాలు తెగించి చోరీలకు పాల్పుతున్నారు. అవసరమైతే ప్రయాణికులను చంపేందుకు కూడా వెనుకాడరు. దీంతో రైళ్లలో ప్రయాణించే వారిలో భయాందోళన నెలకొంది. గాఢ నిద్రలో ఉన్న మహిళల మెడలో నుంచి నగలు దోచుకెళ్లడంతో బోరున విలపిస్తున్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వారిని పట్టుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. అలాగే కదులుతున్న రైలులో ప్రయాణికులను బయటకు తోసేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో రాత్రులలో రైలు ప్రయాణం చేయాలంటే భయపడే రోజులు ఉన్నాయి. రైల్వే శాఖ ముందస్తు చర్యగా రాత్రి పూట ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేయడం చాలా అవరం. ఈ ఘటనలే కాకుండా ఇలాంటివి ఎన్నో జరిగాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని భద్రత పెంచడం ఎంతో ముఖ్యం.

Tags:    

Similar News