Andhra Pradesh : నేడు ఏపీలో వర్షాలు.. పిడుగులు పడే ప్రాంతాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

Update: 2024-06-18 02:16 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు కూడా పడతాయని పేర్కొంది. అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు. గోవా నుంచి దక్షిణ కోస్తా వరకూ ద్రోణి కొనసాగుతుందని ఈ ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లాలో పిడుగులతో పాటు భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపారు.

మైదాన ప్రాంతాల్లో...
పిడుగులు పడతాయి కనుక మైదాన ప్రాంతాల్లో చెట్ల కింద ఎవరూ ఉండవద్దని, ముఖ్యంగా, రైతులు, పశువుల కాపర్లు ఈరోజు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. వీటితో పాటు విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో పాటు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.


Tags:    

Similar News