గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు

Update: 2024-09-23 02:58 GMT

గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. యానాం దర్యాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ సంస్థ వేసిన గ్యాస్ లైన్ నుంచి లీక్ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.

ఓఎన్జీసీ సంస్థ...
నీటిని చీల్చుకుంటూ గ్యాస్ పైకి తంతుండడంతో మంటలు వ్యాప్తించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందో్ళన చెందుతున్నారు. ఓఎన్జీసీ సంస్థ వెంటనే చర్యలు తీసుకుని గ్యాస్ లీకేజీని ఆపాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే ఓఎన్జీసీ సంస్థ సిబ్బంది గ్యాస్ లీక్ ను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News