నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు
భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. తొమ్మిది గేట్లు తెరిచి కిందకు నీరు వదులుతున్నారు
ఎగువన కరుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు తొమ్మిది గేట్లు తెరిచి కిందకు నీరు వదులుతున్నారు. 9 గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఇన్ ఫ్లో 3,50, 341 క్యూసెక్యులు కాగా, అవుట్ ఫ్లో 3,14,293 క్యూసెక్కులుగా ఉంది.
విద్యుత్తు ఉత్పత్తి...
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.80 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 214.450 టీఎంసీలుగా కొనసాగుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్పి కొనసాగుతుంది.