ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం..అంతరాలయ దర్శనం రద్దు

కనకదుర్గమ్మవారి ఆలయంలో ఓ అర్చకుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో ఆలయంలో పనిచేసే

Update: 2022-01-16 06:14 GMT

కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేగింది. కనకదుర్గమ్మవారి ఆలయంలో ఓ అర్చకుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో ఆలయంలో పనిచేసే మిగతా అర్చకులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అమ్మవారి సన్నిధిలో కరోనా కలకలం రేగడంతో అధికార యంత్రాంగం తగు చర్యలు చేపట్టింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమ్మవారి అంతరాయ దర్శనాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు.

ఆలయ అర్చకుల్లో ఒకరికి కరోనా నిర్ధారణ అవడంతో.. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నట్లు దుర్గగుడి ఈఓ భ్రమరాంబ తెలిపారు. క్యూ లైన్లలో ఎప్పటికప్పుడే శానిటైజేషన్ చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు.. స్వీయ నియంత్రణ కూడా పాటించాలని సూచించారు.



Tags:    

Similar News