ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు

Update: 2024-06-20 02:18 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావును ప్రభుత్వం నిన్న రాత్రి నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ డీజీపీగా ఉన్న హరీష్ గుప్తాను తిరిగి హోం సెక్రటరీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ద్వారకా తిరుమలరావు నిన్నటి వరకూ ఆర్టీసీ ఎండీ విధులు నిర్వహించారు.

సీనియారిటీ చూసి...
1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ద్వారకా తిరుమలరావు సీనియారిటీ జాబితాలో ప్రధమ స్థానంలో ఉండటంతో ఆయనను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన కర్నూలు ఏఎస్పీ గా తన తొలి పోస్టింగ్ ను ప్రారంభించారు. అనంతరం కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్సీగా పనిచేశారు. నిజామాబాద్ లోనూ వరక్ చేశారు. కడప, మెదక్ జిల్లాల ఎస్పీగా కూడా విధులు నిర్వహించారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా కూడా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. 2021 నుంచి ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నారు.


Tags:    

Similar News