పవన్‌ను బెదిరించేటందుకే : కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ లో జీరో అయిన చంద్రబాబును రజనీకాంత్ పొగడటం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.;

Update: 2023-04-29 12:01 GMT
పవన్‌ను బెదిరించేటందుకే : కొడాలి నాని
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో జీరో అయిన చంద్రబాబును రజనీకాంత్ పొగడటం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. పవన్ కల్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజనీకాంత్ ను రంగంలోకి దింపారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్ అయ్యారు.

రజనీకాంత్‌పై కొడాలి ఫైర్
ఏపీ రాజకీయాలను పవన్ కల్యాణ్ ఇప్పటికైనా గ్రహించాలని కోరారు. వైశ్రాయి హోటల్ ఘటనలో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజనీకాంత్.. ఇప్పుడు ఎన్టీఆర్ ను పొగడటం సిగ్గుచేటు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును రజనీకాంత్ చదివారని కొడాలి నాని స్పందించారు.


Tags:    

Similar News