పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే?

నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తుందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ హెచ్చరించారు

Update: 2023-01-22 12:35 GMT

నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తుందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ హెచ్చరించారు. పాదయాత్రకు ముందే జగన్ వర్గం, వైసీపీ నేతల పాంట్లు తడిసి పోతున్నాయని ఆయన విమర్శించారు. యాత్రను ఏ విధంగా అడ్డుకోవాలా? అన్న దానిపై వైసీపీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారన్నారు. లోకేష్ పాదయాత్రతో అధికారుల స్థానచలనాలతో పాటు రాష్ట్రంలో రాజకీయం మారబోతుందని ఆయన అన్నారు.

బూజుపట్టిన చట్టాన్ని తెచ్చి....
పాదయాత్రను బూజుపట్టిన చట్టాన్ని తెచ్చి అడ్డుకోవాలని చూస్తున్నారని జవహర్ ఆరోపించారు. లోేకేష్ పాదయాత్రకు పెద్దయెత్తున ప్రజలు నీరాజం పలకనున్నారని చెప్పారు. అన్ని వార్గాల వారు లోకేష్ పాదయాత్ర కోసం ఎదురు చూస్తున్నారన్నారు. లోకేష్ పాదయాత్ర కోసం పెద్దయెత్తున యువత వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుందన్నారు. అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా పాదయాత్ర జరిగి తీరుతుందని ఆయన తెలిపారు.


Tags:    

Similar News