మాజీ మంత్రి నారాయణ కేసులో కీలక పరిణామాలు
పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీ వ్యవహారంతో ఆరోపణలు ఎదుర్కొంటున్నా మాజీ మంత్రి నారాయణ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీ వ్యవహారంతో ఆరోపణలు ఎదుర్కొంటున్నా మాజీ మంత్రి నారాయణ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నారాయణకు బెయిల్ కోసం ఇద్దరి పూచీకత్తుతో పాటు నారాయణను కోర్టులో హాజరుపర్చాలని చిత్తూరు నాలుగో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నిన్న పూచీకత్తుగా ఇద్దరిని నారాయణ తరపున న్యాయవాదులు కోర్టులో హాజరుపరిచారు.
దీంతో నారాయణ తరపున న్యాయవాదుల వైఖరిపైన కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కోర్టులో హాజరుపర్చకపోతే బెయిల్ ఎలా ఇస్తామని ప్రశ్నించింది. దీంతో ఇవాళ నారాయణను కోర్టులో హాజరుపరుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పైగా నేటితో షురిటీ అందించడానికి గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.