సుప్రీంకోర్టులో ఊరట
సుప్రీంకోర్టులో మాజీ మంత్రి నారాయణకు ఊరట కలిగింది. పేపర్ లీకేజీ కేసులో హైకోర్టు తీర్పుపైస్టే విధించింది.
సుప్రీంకోర్టులో మాజీ మంత్రి నారాయణ ఊరట కలిగింది. పేపర్ లీకేజీకేసులో బెయిల్ రద్దుచేయాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఏడాది పదో తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయి. అనేక చోట్ల ముందుగానే వాట్సప్ లలో ప్రశ్నాపత్రాలు కన్పించాయి.
హైకోర్టు ఉత్తర్వులపై స్టే...
దీనిపై విచారించిన పోలీసులు మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు చేశారు. అయితే ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. ఆయనను విచారించడానికి అనుమతివ్వాలని పోలీసులు కోరుతున్నారు. మరోవైపు హైకోర్టు బెయిల్ రద్దు చేయాలని తీర్పు చెప్పింది. దీనిపై నారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించగా దానిపై కోర్టు స్టే విధించింది.