శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయం నాలుగు గేట్లు పది అడుగులు మేర ఎత్తి దిగువకు వరదనీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,60,146 క్యూసెక్కులు గా ుంది. ఔట్ ఫ్లో 1,77,040 క్యూసెక్కులుగా ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు.
నాలుగు గేట్లు ఎత్తి...
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. నాలుగు గేట్లు ఎత్తడంతో పర్యాటకులు కూడా ప్రాజెక్టు వద్దకు చూసేందుకు తరలి వస్తున్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.