శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. శ్రీశైలం ఐదు గేట్లను ఎత్తిన అధికారులు కిందకు నీటిని విడుదల చేస్తున్నారు

Update: 2024-10-25 03:53 GMT

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. శ్రీశైలం ఐదు గేట్లను ఎత్తిన అధికారులు కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. ఐదు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. బయట ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి నీరు పుష‌కలంగా చేరింది.

గేట్లు ఎత్తడంతో...
శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,59,089 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 2,07,820 క్యూసెక్కులు గా నమోదయిందని అధికారులు తెలిపారు.శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. గేట్లుఎత్తడంతో చూసేందుకు పర్యాటకులు అత్యధిక సంఖ్యలో వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News