ధవళేశ్వరానికి పెరుగుతున్న వరద
కృష్ణానది జన్మస్థానమైన మహాబలేశ్వర్ లో 6 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరో వైపు కృష్ణా ఉపనదిగా ఉన్న..
ఆల్మట్టి వద్ద కృష్ణా నదికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. నిన్న1.14 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి 1.16లక్షలుగా నమోదైంది. కృష్ణానది జన్మస్థానమైన మహాబలేశ్వర్ లో 6 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరో వైపు కృష్ణా ఉపనదిగా ఉన్న తుంగభద్రకు వరద పోటెత్తుతోంది. తుంగభద్రకు సోమవారం 47 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. మంగళవారం ఇన్ ఫ్లో 73 వేలకు పెరిగింది. క్యాచ్ మెంట్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ఇన్ ఫ్లో నేటికి లక్ష క్యూసెక్కులకు రాయలసీమ జలవనరుల నిపుణుడు సింగంరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. డ్యామ్ లోకి 1,08,019 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. అవుట్ ఫ్లో 198 క్యూసెక్కులుగా నమోదైంది.
తుంగభద్ర పూర్తిస్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 40.136 టీఎంసీలకు చేరింది. డ్యామ్ లో 1633 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గానూ.. ప్రస్తుతం 1611.27 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. మరోవైపు 90 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ లో నీటి నిల్వ 64 టీఎంసీలకు పెరిగింది. ప్రస్తుత ఇన్ ఫ్లో 14 వేల క్యూసెక్కులుగా ఉందని వివరించారు. రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి 9.11 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే శ్రీశైలం రిజర్వాయర్ కు 28 వేల క్యూసెక్కుల వరద వస్తోందని తెలిపారు.