పేరు మార్పుపై పురంద్రీశ్వరి ఫైర్

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని మాజీ కేంద్ర మంత్రి పురంద్రీశ్వరి తప్పు పట్టారు

Update: 2022-09-22 13:19 GMT

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని మాజీ కేంద్ర మంత్రి పురంద్రీశ్వరి తప్పు పట్టారు. ఎన్టీఆర్ పేరును యూనివర్సిటీకి తొలగించి వైఎస్సార్ పేరును ఎందుకు పెట్టారో ప్రజలకు వివరించాలని ఆమె కోరారు. పురంద్రీశ్వరి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ అంటే తనకు అభిమానమని చెప్పిన ఆమె ఎన్టీఆర్ పేరును ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పాలన్నారు.

పేరు మార్చడం అంటే...
పేరు మార్చడం అంటే ఎన్టీఆర్ ను అవమానపర్చడమేనని అన్నారు. ఎన్టీఆర్ పై గౌరవం ఉందంటూనే అగౌరవపర్చే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలన నడుస్తుందని పురంద్రీశ్వరి ఫైర్ అయ్యారు. మద్యనిషేధాన్ని అమలు చేయకుండా మాట తప్పారన్నారు. మహిళల ఆశలను నీరుగారుస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి ఎన్టీఆర్ పేరును పెడతామని ఆమె చెప్పారు.


Tags:    

Similar News