ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 28కి చేరుకున్నాయి;

Update: 2022-01-05 08:10 GMT
omicron, andhra pradesh, four cases, parkasam, guntur
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 28కి చేరుకున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రకాశంలో మూడు, గుంటూరులో ఒక ఒమిక్రాన్ కేసు నమోదయింది. గత కొద్దిరోజులుగా ఒమిక్రాన్ కేసులు ఎక్కువవుతున్నాయి.

కొత్తగా సోకిన....
మొన్నటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారికే ఈ వేరియంట్ సోకేది. కానీ ఇప్పుడు దేశంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారికి కూడా ఒమిక్రాన్ సోకుతున్నట్లు తేలింది. వైద్యాధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని హెచ్చరిస్తున్నారు. లేకుంటే వేగంగా ఈ వేరియంట్ విస్తరించే అవకాశముందని చెబుతున్నారు.


Tags:    

Similar News