గంగా పుష్కరాలకు వెళ్లే తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్
ఈ నెల 22 నుంచి గంగా పుష్కరాలు ప్రారంభమైన నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి రక్సోల్ (07007) వరకు నడిచే ప్రత్యేక రైలును
గంగా పుష్కరాలు మొదలయ్యాయి. ఏప్రిల్ 22 నుండి మే5 వరకూ 12 రోజులపాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి. గంగా పుష్కరాలకు దేశనలుమూలల నుండి ప్రజలు వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుండి పుష్కరాలకు వెళ్లే ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు ప్రజలకోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు నుంచి వేర్వేరుగా మూడు ప్రత్యేక రైళ్లను నడపనుంది. వాటి వివరాలు, టైమింగ్స్, గమ్య స్థానాలను తెలుపుతూ అధికారిక ప్రకటన చేసింది.
ఈ నెల 22 నుంచి గంగా పుష్కరాలు ప్రారంభమైన నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి రక్సోల్ (07007) వరకు నడిచే ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్-వారణాసి మీదుగా రక్సోల్ చేరుకుంటుంది. ఏప్రిల్ 23, ఏప్రిల్ 30, మే 7 తేదీలలో సికింద్రాబాద్ నుంచి రక్సోల్‌కి ప్రతి ఆదివారం రాత్రి 10: 30 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది.
అలాగే తిరుపతి నుండి దానాపూర్ (07419) మరో స్పెషల్ ట్రైన్ ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ తిరుపతి నుంచి ప్రయాగ్ రాజ్-వారణాసి మీదుగా దానాపూర్ చేరుతుంది. ఇక ఈ ట్రైన్ ఏప్రిల్ 22 & 29 అలాగే, 06 మే తేదీలలో తిరుపతి నుంచి దానాపూర్ కు రైలు బయలుదేరుతుంది. గుంటూరు నుంచి బెనారస్(07230) కు మరో రైలు ఉంది. ఈ ట్రైన్ గుంటూరు నుంచి ప్రయాగ్ రాజ్ మీదుగా బెనారస్ వరకు వెళ్తుంది. ఏప్రిల్ 22 & 29 అలాగే, 06 మే తేదీలలో ఇది నడుస్తుంది. గంగా పుష్కరాలకు వెళ్లే ప్రజలు ఈ రైళ్ల సర్వీసులను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.