నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ విచారణ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది;

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ వేసిన పిటీషన్ పై విచారణ జరపనుంది. ఇప్పటికే సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.
బెయిల్ ఇవ్వవద్దంటూ...
వల్లభనేని వంశీ పై వరసగా కేసులు నమోదు అవుతుండటంతో పాటు మైనింగ్ కేసులు కూడా బుక్ కావడంతో ఈ కేసులో బెయిల్ లభించినా మరొక కేసు వల్లభనేని వంశీ మెడకు చుట్టుకునే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇటు వంశీకి బెయిల్ ఇవ్వవద్దంటూ పోలీసుల తరుపున న్యాయవాదులు కూడా వాదించనున్నారు.