ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
గోదావరి వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు మరోసారి ముప్పు ఏర్పడింది. గోదావరి వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ధవళేశ్వరం ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 13.19 లక్షల క్యూసెక్కులు గా ఉందని నీటిపారుదల శాఖ అికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత నెలలో వరదలతో ఇబ్బంది పడిన ప్రజలు ఇంకా తేరుకోకముందే ఈ నెల మొదటి వారంలోనే మరలా వరదలు పోటెత్తుతున్నాయి.
నలభై గ్రామాల్లోకి...
ఇప్పటికే నలభై గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. ఈ నలభై గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీతారామనగరం, ముత్యాలమ్మ పాడు వెళ్లే రహదారులు నీట మునిగాయి. ఇక ఏలూరు జిల్లాలో కుక్కునూరు - దాచారం మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బాధిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు.