Godavari Alert : గోదావరికి వరదపోటు.. అప్రమత్తంగా ఉండాల్సిందే

గోదావరికి వరద నీటి మట్టం పెరుగుతోంది. ఈ మేరకు అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు

Update: 2024-09-05 02:39 GMT

గోదావరికి వరద నీటి మట్టం పెరుగుతోంది. ఈ మేరకు అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగుతుంది. ఇప్పటికే వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

కోనసీమ ప్రజలు...
భద్రాచలం వద్ద ప్రస్తుతం 43.6 అడుగుల నీటి మట్టం ఉంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.36 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రభావిత ఆరు జిల్లాల అధికార యంత్రంగాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తులను అప్రమత్తం చేసింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ కోరారు.


Tags:    

Similar News