వాలంటీర్లకు ఊహించని గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చారు. ఇదొక విప్లవాత్మక నిర్ణయం అంటూ వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. చాలా సమయాల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ గొప్పగా పని చేసిందని కూడా ప్రశంసలు దక్కాయి. ప్రతి పక్షాలు ఈ వ్యవస్థపై సంచలన ఆరోపణలు కూడా చేశాయి. ప్రతీ నెలా ప్రభుత్వం నుండి వాలంటీర్లకు 5000 రూపాయలు గౌరవ వేతనం దక్కుతూ ఉండగా.. వచ్చే ఏడాది ఆ గౌరవ వేతనం మరింత పెరగనుంది.
ప్రభుత్వం తరఫున ఇంటింటికీ సేవలందిస్తున్న వాలంటీర్లకు వచ్చే నెల నుంచి జీతం పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు కానుకగా మంత్రి ఈ ప్రకటన చేశారు ఆయన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పుట్టిన రోజు కానుకగా వాలంటీర్ల జీతం అదనంగా రూ.750 పెంచనున్నట్లు మంత్రి కారుమూరి చెప్పారు. పెంచిన వేతనాన్ని వాలంటీర్లు వచ్చే నెల 1 నుంచే అందుకుంటారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని.. అందుకే రాష్ట్రంలో జగన్ పాలన పోవాలని అంటున్నారని విమర్శించారు.