Andhra Pradesh : బర్డ్ ఫ్లూపై ఏపీ సర్కార్ అలెర్ట్.. వాటిపై నిషేధం

ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూపై ప్రభుత్వం అప్రమత్తమయింది. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షించారు;

Update: 2025-02-12 06:34 GMT
government, alert, achchennaidu, andhra pradesh
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూపై ప్రభుత్వం అప్రమత్తమయింది. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షించారు. తగిన ఆదేశాలు జారీ చేశారు. అరాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖామంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

చనిపోయిన కోట్లను...
చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ల్యాబ్‍కు పంపాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. పరిస్థితిని బట్టి జోన్ల ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, పూర్తి స్థాయిలో సర్వైలెన్స్ ఉండాలని ఆయన అన్నారు. పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మెజర్స్ అమలు చేయాలని కోరారు. సంబంధిత పౌల్ట్రీల వద్ద రవాణా వాహనాలు సంచరించకుండా ఆదేశాలు చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు సంబంధిత ప్రాంతాల నుంచి కోళ్ల రవాణా నిషేధించాలని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖామంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.


Tags:    

Similar News