ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది;

Update: 2024-10-09 05:30 GMT
liquor lovers,  prices,  increase, andhra pradesh

liquor shops in AP

  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మద్యం టెండర్ల షెడ్యూల్‌ను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పనిచేయవని ప్రభుత్వం దృష్టికి పలువురు దరఖాస్తుదారులు తీసుకెళ్లడంతో గడువును పొడిగించింది.

16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం...
వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తితో మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 11 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈనెల 14న మధ్యం షాపులకు అధికారులు లాటరీ తీయనున్నారు. ఈనెల 16 నుంచి కొత్త మద్యం విధానం ఏపీలో అమలు కానుంది.
Tags:    

Similar News