ఏపీలో ఆధార్ కార్డు కావాలా? అయితే సోమవారం నుంచి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఆధార్ కార్డు పొందేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది;

Update: 2025-02-22 06:54 GMT
aadhaar card, good news, special arrangements, andhra pradesh
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఆధార్ కార్డు పొందేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే సోమవారం నుంచి కొత్త ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారి కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతి సంక్షేమ పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో దీని కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు.

ఎంత మంది ఉన్నారంటే?
ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అన్ని జిల్లాల్లోనూ ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంచాలకులు శివప్రసాద్ సూచించారు. ఆరేళ్లలోపు చిన్నారుల పేర్లతో కొత్తగా ఆధార్ నమోదు, పాతవాటి నవీకరణకు వీలుగా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరేళ్లలోపు ఉన్న 8,53,486 మందితో ఆధార్ నమోదు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.


Tags:    

Similar News