అమ్రాపాలికి పోస్టింగ్... టూరిజం ఎండీగా

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.;

Update: 2024-10-28 02:12 GMT
IAS officers,  posting, telangana, andhra pradesh
  • whatsapp icon

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ నుంచి ఇటీవల ఏపీకి నలుగురు ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో అమ్రపాలి కాట్రగడ్డను పర్యాటక శాఖ ఎండీగా నియమించారు.

వాకాటి కరుణను...
వైద్యారోగ్య శాఖ కమిషనర్ గా వాకాటి కరుణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా వాణిమోహన్ ను, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ ను నియమించింది. అయితే తెలంగాణ నుంచి వచ్చిన రొనాల్డ్ రోస్ కు మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రశాంతిని అటవి, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శిగా నియమించారు.


Tags:    

Similar News