Andhra Pradesh : ఏపీలో ఒంటి పూట బడుల వేళల మార్పు
ఆంధ్రప్రదేశ్ లో వేసవి తీవ్రతకు ప్రభుత్వం ఒంటిపూట బడుల్లో స్వల్ప మార్పులు చేసింది;

dussehra holidays
ఆంధ్రప్రదేశ్ లో వేసవి తీవ్రతకు ప్రభుత్వం ఒంటిపూట బడుల్లో స్వల్ప మార్పులు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి పరీక్షలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమయిన నేపథ్యంలో పరీక్షలు జరుగుతున్న స్కూళ్లలో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని నిర్ణయించింది.
స్వల్ప మార్పులతో...
ఇప్పటివరకు 1.15 గంటలకే స్కూల్స్ ప్రారంభమయ్యేవి. మిగిలిన స్కూళ్లకు ఉదయం 7:45 గంటల నుంచి 12:30 గంటల వరకు తరగతలు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలో మాత్రం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.