వర్మకు సీఐడీ నోటీసులు
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు;

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును వర్మ ఆశ్రయించారు.' కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి వర్మపై అనేక ఫిర్యాదులు అందడంతో ఈ నోటీసులను రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు.
విధ్వేషాలు రెచ్చగొట్టేలా...
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు సీఐడీకి అందాయి. విచారణకు హాజరు కావాలని తాజాగా సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును రామ్ గోపాల్ వర్మ ఆశ్రయించారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆర్జీవీ పిటీషన్ లో కోరారు.