Posani Krishna Murali : పోసాని ఇప్పుడన్నా జైలు నుంచి విడుదలవుతారా?
సినీనటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.;

సినీనటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పోసాని కృష్ణ మురళి తనకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిషన్ పై విచారించిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెపపింది. ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
గత ప్రభుత్వంలో...
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోసాని కృష్ణ మురళి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ను దూషించిన కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణ మురళిపై నమోదయిన అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. దీంతో ఆయన ఈరోజు, రేపట్లో గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.