జగన్ బెయిల్ కేసు విచారణ వాయిదా
వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. సీబీఐ, ఈడీ కేసుల స్టేటస్ వివరాలు నిన్న సాయంత్రం ఫైల్ చేసినట్లు సీబీఐ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు చెప్పారు. సీబీఐ దాఖలు చేసిన స్టేటస్ రిపోర్ట్ కాపీ తాము పరిశీలిస్తామని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం పేర్కొంది.
వచ్చేనెల పదోతేదీకి...
తాము కూడా చూడటానికి కొంత సమయం కావాలని జగన్ తరఫు న్యాయవాది కోరారు. జనవరి 10న తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.జగన్ బెయిల్ రద్దు చేయాలని గతలో రఘురామ కృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం తదుపరి విచారణ జనవరి 10 కి వాయిదా వేసింది.