ఈరోజైనా బెయిల్ వస్తుందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై నేడు విచారణ జరగనుంది.

Update: 2023-10-05 06:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో గత 27 రోజులుగా చంద్రబాబు రాజమండ్రిలోని కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఆయన వేసిన క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు క్వాష్ పిటీషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఏసీబీ కోర్టులో బెయిల్ పిటీషన్ వేశారు. మరోవైపు సీఐడీ చంద్రబాబు రిమాండ్ ను పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. చంద్రబాబు రిమాండ్ ను పదిహేను రోజుల పాటు పొడిగించాలని కోరుతూ పిటీషన్ సీఐడీ తరుపున న్యాయవాదులు దాఖలు చేశారు.

కస్టడీ పిటీషన్‌ కూడా...
అలాగే తమకు మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరింది. ఈ పిటీషన్‌పై కూడా విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టులో ఇరువర్గాల వాదనలను చంద్రబాబు తరుపున, సీఐడీ తరుపున న్యాయవాదులు వినిపించనున్నారు. చంద్రబాబు తరుపున సీనియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే వాదిస్తున్నారు. దీంతో ఈరోజు బెయిల్ వస్తుందా? రాదా? అన్న టెన్షన్ నెలకొంది. ఈ రెండు కీలకం కావడంతో ఏసీబీ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News