శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతుంది. ప్రాజెక్టు పది గేట్లు 15 అడుగుల మేర ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు

Update: 2022-10-15 04:00 GMT

శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతుంది. ప్రాజెక్టు పది గేట్లు పదిహను అడుగుల మేర ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో 3,85,530 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 4,43,293 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 884.60 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 213 టీఎంసీలుగా ఉందని అధికారులు చెబుతున్నారు. కుడి, ఎడమ జలవిద్యుత్త్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుంది.

ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా.....
ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 4.07 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణా నదీ తీరవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాల్వలు, వాగులు దాటే ప్రయత్నం ప్రజలు చేయవద్దని విపత్తుల సంస్థ ఎండీ అంబేద్కర్ సూచించారు.


Tags:    

Similar News